బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎలాగైనా తమకే టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు నేతలు ఏకంగా సీఎం నితీష్ కుమార్ ఇంటి వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పాట్నాలోని సీఎం నివాసం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.