NDL: గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్య క్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని ఏపీలో పర్యటించినట్లు తెలిపారు.