ASF: సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు బుధవారం హైదరాబాద్ సచివాలయంలో కార్మిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, లేబర్ కమిషనర్ దాన కిషోర్ని కలిశారు. సిర్పూర్ పేపర్ మిల్లు పరిశ్రమలో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చాలా కాలంగా ఎన్నికలు జరగక పోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.