VSP: ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, అనకాపల్లి, పాడేరు పరిధిలోని శివాలయాల్లో భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఎన్.సుజాత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉప కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ఏర్పాట్లపై చర్చించారు.