CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరు వాస్తవ్యులు KV.అమర్నాధ్ ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళాన్ని ఆలయ ఏఈవో రవీంద్ర బాబుకు అందజేశారు. ఆలయ అధికారులు వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు.