WGL: రాయపర్తి మండలం ఊకోల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని దీకొండ మయూరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. మంగళవారం వరంగల్లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-17 పోటీల్లో మయూరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్ బుధవారం తెలిపారు.