MNCL: నెన్నెల మండలం గంగారాం గ్రామంలో ఈనెల 3వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు కడారి బక్కన్న వరంగల్ MGM లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI ప్రసాద్ తెలిపారు. గత ఏడాది 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్న బక్కన్న పంట నష్టం రావడంతో పంట కోసం తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో తెలియక గడ్డి మందు తాగినట్లు పేర్కొన్నారు.