BHNG: మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామం నుంచి బుజిలాపురం వరకు బీటీ రోడ్డు వేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, వెంకటేశ్, గుండు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.