NDL: ఉత్తమ అవార్డు గ్రహీత మహమ్మద్ రఫీని ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజకుమారి ఘనంగా సన్మానించారు. డోన్ పట్టణంలో మహమ్మద్ రఫీ అనేక సేవా కార్యక్రమాలు చేసేవారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రఫీ సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.