BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో నేటి ఆధునిక యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను గట్టిగా నమ్ముతున్నారు. మంత్రాలు, చేతబడి, దుష్టశక్తుల భయంతో జీవిస్తున్నారు. నడుస్తున్న కాలియుగంలో ఇలాంటి నమ్మకాలను విడనాడి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని నిపుణులు బుధవారం సూచించారు. గ్రామ ప్రజలు అవగాహన పెంచుకుని ముందుకు సాగాలని కోరారు.