KRNL: సీఎం చంద్రబాబు గురుకులాలు సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరేంజనేయ స్వామి అన్నారు. బుధవారం రాత్రి కర్నూలులోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి అంబేడ్కర్ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లను 3 నుంచి 10కి పెంచామన్నారు.