NLG: మర్రిగూడ SI మునగాల కృష్ణారెడ్డి ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నారని TDP మం. అధ్యక్షుడు వెంకన్న యాదవ్ విమర్శించారు. బుధవారం మర్రిగూడలో ఆయన మాట్లాడుతూ.. భీమనపల్లిలో శాంతియుతంగా దుర్గామాత శోభయాత్ర నిర్వహిస్తున్న యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి SIపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.