విజయనగరం: సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పి.రవికుమార్ అన్నారు. బొబ్బిలి మండలం దిబ్బగుడివలస సచివాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామంలో సమస్యలు గుర్తించి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.