MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన నాలుగవ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.