KRNL: కర్నూలు కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఆమె అక్కడి వారితో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన భోజన సదుపాయాన్ని అందిస్తున్న నిర్వాహకులను ప్రశంసించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.