NGKL: అమ్రాబాద్ మండలంలోని మొల్క మామిడి గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 220/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బుధవారం సాయంత్రం పరిశీలించారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.