ADB: కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త DCC పదవికి అర్హుడని AICC పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. బుధవారం ఇచ్చోడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండే వ్యక్తిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని అజయ్ సింగ్ను కోరినట్లు కాంగ్రెస్ పార్టీ బోథ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ కోరారు.