SRCL: తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా నిట్టూరు గ్రామంలో గురువారం జాతీయ పశువ్యాధుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాడిపశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, పశుసంవర్ధక శాఖ పోస్టర్ ను ఆవిష్కరించారు.