GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళదాస్ నగర్ ఎదురుగా ఉన్న బెస్ట్ ప్రైజ్ మాల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. సహచరులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురికీ తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.