కృష్ణా: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లి మండలం మల్లంపూడిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ ఉప్పాల రామ మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలియజేయాలన్నారు.