VZM: దీపావళీ పండగ నేపథ్యంలో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి చింతలపాలెం సర్వే నంబర్ 32/ 2,3లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం 516 బి.నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎం.ఆర్.ఐని ఆదేశించారు.