ATP: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సవితమ్మ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఇతర ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నాయకులు కూడా హాజరై ప్రధానమంత్రిని ఆహ్వానించి, సభను విజయవంతంగా నిర్వహించారు.