BHNG: బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీని గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. CPM రామన్నపేట మండల కార్యాలయంలో బుధవారం జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.