GDWL: విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్ సంతోష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బురదపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రత్యేక తరగతులను ప్రతిరోజు కచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు.