SRPT: మునగాల మండలం కోదండరాంపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త అంజి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. అధికారులు స్పందించాలని కోరారు.