AKP: మునగపాక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఎంపీపీ ఎం జయలక్ష్మి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.