NLG: నల్గొండలోని మర్రిగూడెం బైపాస్ వద్ద విధులు నిర్వహించేందుకు స్కూటీపై వెళ్తున్న ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ సిరిని వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై విజయబాయి వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించారు.