బీహార్ ఎన్నికల్లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సింగర్ మైథిలీ ఠాకూర్ (25)కు అలీనగర్ స్థానం నుంచి MLA టికెట్ ఇచ్చింది. పలు భాషల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మైథిలి, నిన్ననే BJPలో చేరడం విశేషం. ఆమె గతంలో PM మోదీ చేతుల మీదుగా ‘కల్చరల్ అంబాసిడర్’ అవార్డు అందుకున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు BJP ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.