AP: విజయవాడ సీపీని వైసీపీ నేతలు కలిశారు. మాజీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ పేరుతో ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు విన్యాసాలను ప్రజలు గమనించాలని జోగి రమేష్ కోరారు. తన సెల్ఫోన్లు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన పేరుతో నకిలీ చాట్ తయారు చేశారని ఆరోపించారు.