భారతదేశానికి మరోసారి అరుదైన అవకాశం దక్కింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. ఈ క్రీడలకు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం వేదిక కానుంది. 2010లో ఢిల్లీలో నిర్వహించిన తర్వాత 20 ఏళ్ల విరామం అనంతరం 2030లో మరోసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కొత్త స్టేడియాల కారణంగా అహ్మదాబాద్ ఎంపికైనట్లు సమాచారం.