ప్రకాశం: మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం కనిగిరి వైసీపీ కార్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్నఇన్ఛార్జ్ డాక్టర్ దద్దార నారాయణ యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు విద్యా దూరమైపోతుందని ఆయన అన్నారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుందన్నారు.