MDK: పెద్ద శంకరంపేట పోచమ్మ గల్లిలో ముత్యాలమ్మ, పోచమ్మ ఆలయంలో బుధవారం అమ్మవార్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అభిలాష్ శర్మ, మహేష్ శర్మ, ఆలయ ధర్మకర్త కొడగంటి హరిప్రసాద్ గౌడ్, ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, ఓడి బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు.