కృష్ణా: భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బుధవారం గన్నవరంలోని ఆయన కార్యాలయంలో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటింటికి దినపత్రికలు పంపిణీ చేయగా వచ్చిన డబ్బుతో చదువుకున్నారన్నారు.