కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం నెలవారీ పూజల కోసం ఈనెల 17న తెరుచుకోనుంది. శుక్రవారం సా.4 గంటలకు ప్రధాన పూజారి ఆలయ తలుపులు తెరుస్తారు. ప్రధాన పూజారులు అరుణ్ కుమార్ నంబూద్రి, కందరారు మహేష్ మోహనరు సమక్షంలో ఉత్సవ దీపం వెలిగిస్తారు. మలయాళ మాసం ‘తులం’ మొదటి రోజున అంటే ఈనెల 18న ఉ.5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది.