ప్రకాశం: జన విజ్ఞాన వేదిక గత 35 సంవత్సరాలుగా శాస్త్రి ఆలోచన విధానాన్ని పిల్లలలో పెంపొందించడానికి చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో కోటి రెడ్డి తెలియజేశారు. బుధవారం పామూరులో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 18వ తేదీన మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.