పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద ఇటీవల జరిగిన ఘర్షణల్లో చాలా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరింది. సరిహద్దులో 48 గంటల పాటు కాల్పులను నిలిపివేయడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఇస్లామాబాద్ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం ఉద్రిక్తతను తగ్గించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.