TPT: తిరుమల శ్రీవారి సొమ్మును వైసీపీ పాలకులు అన్ని విధాలుగా దోచేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. ధర్మకర్తల స్థానంలో ఉండి స్వామివారి ఆస్తులను రక్షించాల్సింది పోయి భక్షకులుగా తయారయ్యారని మండిపడ్డారు. పరకామణి కుంభకోణం కేసులో దోషులు ఎవరైనా వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.