TPT: మాజీ సీఎం జగన్ సూచనలతో పార్టీ చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన నివాసం వద్ద ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.