TG: ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం గమనార్హం.