NZB: బోధన్ పట్టణంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని టీవీయూవీ, టీజీవీపీ కోరారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. టీవీయూవీ వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్ మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట కళాశాలలో చదివే విద్యార్థి తప్పిపోయాడని, యాజమాన్యం విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసిందని ఆరోపించారు.