ప్రకాశం: కనిగిరి ఏపీ మోడల్ స్కూల్‌ను సమగ్ర శిక్షణ అధికారిని హేమలత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల వసతి, భోజనం, మెనూ సరిగా అమలవుతుందా లేదా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచికరమైన మంచి భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. మోడల్ స్కూల్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.