TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల సమీపంలోని పుట్ పాత్పై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చరీకి తరలించారు. కాగా, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే వెస్ట్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.