AP: కర్నూలు పర్యటనపై ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్టు చేశారు. ‘శ్రీశైలం మల్లికార్జునుడిని రేపు దర్శించుకోబోతున్నా. కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’ అంటూ పేర్కొన్నారు.