NZB: ప్రస్తుత సమాజంలో రోబోటిక్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగారత్నం అన్నారు. భౌతిక శాస్త్రం సోహం అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రోబోటిక్స్‌పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రోబోల వాడకం సర్వసాధారణమవుతోందన్నారు.