ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి బుధవారం తన పుట్టినరోజు వేడుకలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుమారుడు రాఘవరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని తాను భావించానన్నారు. రాబోయే రోజుల్లో అవకాశం వస్తే తన కుమారుడు రాజకీయాల్లోకి రావడం గ్యారంటీ అని, కుమారుడిని ప్రజలు ఆదరించాలని మాగుంట కోరారు.