కృష్ణా: రైతులు సామాజిక మాధ్యమాల వినియోగంలో పరిణతి పొందాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ డీ. సుధారాణి అన్నారు. బుధవారం వక్కలగడ్డలో ఐసీటీ సాంకేతిక సాధనాల వినియోగం, ప్రస్తుత వరిలో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతులు కిసాన్ సారథి, ఎన్పీఎస్ఎస్, ఎం. కిసాన్ వంటి వ్యవసాయ సమాచార యాప్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.