MBNR: ప్రమాదవశాత్తు వాగు గుంతలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తిరుమలపురం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య (50) గ్రామంలోని పోచమ్మ ఆలయం సమీపంలోని వాగు గుంతలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనపై విచారణ చేపట్టారు.