HNK: పరకాల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బండారి కొమురయ్య తీవ్రంగా గాయపడ్డారు. హుజురాబాద్(M) పెద్దపాపయ్యపల్లికి చెందిన కొమురయ్య బైక్ పై వస్తుండగా, వరంగల్ నుంచి వస్తున్నా వేములవాడ డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.