బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన ‘రా. వన్’ మూవీ ఫ్లాప్ అవ్వడంపై దర్శకుడు అనుభవ్ సిన్హా స్పందించారు. షారుఖ్‌తో తాను తీసిన సినిమా ఫ్లాప్ అయిందని అందరూ అనుకున్నారని, అది తనని మానసికంగా దెబ్బతీసిందని తెలిపారు. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందన్నారు. షారుఖ్‌తో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు.