WGL: పర్వతగిరి మండలానికి చెందిన దీప్తి జీవంజి మరో గోల్డ్ మెడల్ సాధించింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న విర్ట్చూస్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025లో టీ-20 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ఇటీవల పాల్గొన్న దీప్తి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన 200మీ. పరుగు పందెంలో మరో గోల్డ్ మెడల్ సాధించి సత్తాచాటింది.